20 August 2023
హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద భిక్షాటన చేసే కొన్ని యాచక కుటుంబాలు నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇటీవల నగరంలో 'బిచ్చగాళ్ల మాఫియా'పై పోలీసులు దాడులు నిర్వహించారు. ట్రాన్స్‌జెండర్ల ముసుగులో బెగ్గింగ్ చేస్తున్న దాదాపు 50 మందిని అరెస్టు చేశారు.
ఈ సమయంలో పోలీసులు కొన్ని కుటుంబాలతో మాట్లాడినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారి ఒకరు తెలిపారు
వీరంతా ఉదయం 10 గంటలకు ఆటో రిక్షాలలో వచ్చి.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఉండి భిక్షాటన చేస్తారని.. వీరి సంపాదాన వేలల్లో ఉంటుందన్నారు
భర్త, భార్య, నలుగురైదుగురు పిల్లలు, వృద్ధులతో సహా మొత్తం కుటుంబం ఒక జంక్షన్ వద్ద భిక్షాటన చేస్తున్నారని.. ఒక్కొక్కరి సంపాదాన రూ.4 వేల నుంచి 7వేల వరకు ఉంటుందన్నారు.
ఈ కుటుంబాలు రుణాలు ఇచ్చే వ్యాపారం కూడా చేస్తున్నాయని, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో బిర్యానీ పొట్లాలు, మద్యం లేదా కల్లు తీసుకుంటారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఆదాయంతో ఆకర్షితులై కొందరు మాఫియాను ఏర్పాటు చేసి శారీరకంగా వికలాంగులు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలకు ఉపాధి కల్పించడం ప్రారంభించారని.. నిర్వాహకులు ఒక్కొక్కరికి 200, ఆహారం ఇస్తారని తెలిపారు.