భూమిపై ఉండే నీరు ఎందుకు కిందకు పడిపోదు..?
TV9 Telugu
11 January 2024
భూమిపై నీరు ఎలా ఎప్పుడు పుట్టింది అనేది గ్రహశాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఖగోళ జీవశాస్త్ర రంగాలలో పరిశోధనాంశంగా ఉంది.
సౌర వ్యవస్థలోని రాతి గ్రహాలలో భూమి ప్రత్యేకమైనది. దాని ఉపరితలంపై ద్రవరూప నీటి మహాసముద్రాలను కలిగి ఉన్న ఏకైక గ్రహం ఇది.
ఇతర గ్రహాల కంటే ఎక్కువగా నీరు భూమిపై ఎందుకు ఉంది అనే విషయం మానవ మేధకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు.
దాదాపుగా 4500 కోట్ల సంవత్సరాలుగా భూమిపై నీరు సమీకృతమై సముద్రాలు ఎలా ఏర్పడ్డాయని ఖగోళ చరిత్ర చెబుతోంది.
అంతరిక్షం నుంచి వచ్చిపడిన ఉల్కల ద్వారా నీరు, ఇతర కీలక రసాయన పదార్థాలు భూమికి వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
భూమిపై ఉన్న నీరు కిందికి పడకపోవడానికి కారణం గురుత్వాకర్షణ శక్తి. దీనివల్ల భూమి తనవైపునకు అన్నింటినీ ఆకర్షిస్తుంది.
అటువంటి పరిస్థితిలో, భూమి కేంద్ర బిందువు వద్ద ఎలాంటి పదార్థాన్ని అయినా తనకు తానుగా అతుక్కొని ఉంచుతుంది.
గురుత్వాకర్షణ శక్తి అన్ని వైపుల నుండి భూమి వైపు వస్తువులను ఆకర్షిస్తుంది. ఈ కారణంగా నీరు కూడా భూమిలో నిలిచిపోతుంది.
97 శాతం నీరు సముద్రంలో, 1.6 శాతం భూమి కింద ఉంది. కేవలం 3 శాతం నీరు మాత్రమే జీవరాశులు తాగడానికి ఉపయోగపడుతుంది.
2.4 శాతం హిమానీనదాలు, ఉత్తర-దక్షిణ ధ్రువంలో నిల్వ ఉంది. నదులు, సరస్సులు, చెరువుల్లోని 0.6 శాతం నీరు మాత్రమే ఉపయోగపడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి