భారత్‌లో తొలి ప్రైవేట్ జెట్‌ను ఎవరు కొనుగోలు చేశారో తెలుసా ?

TV9 Telugu

13 April 2024

కొంతమంది గొప్ప గొప్ప సెలెబ్రెటీలకు, భారతీయ క్రికెట్ ఆటగాళ్లకు వారి సొంతంగా ప్రైవేట్ జెట్ లు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది ధనవంతులు ప్రైవేట్ జెట్‌లను సొంతం చేసుకోవడం ఎప్పటినుంచో ప్రారంభించారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది స్టార్ హీరోలకు కొన్ని ప్రత్యేకమైన ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి.

ఎంత మంది భారతీయులకు సొంతంగా ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయో తెలుసా ? ప్రస్తుతం 142 మందికి పైగా ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి.

ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, విజయ్ మాల్యా, రతన్ టాటా మరియు గౌతమ్ సింఘానియాలకు సొంత జెట్ విమానాలు ఉన్నాయి.

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ జెట్ విమానాన్ని అప్పట్లో పాటియాలా మహారాజా భూపిందర్ సింగ్ కొనుగోలు చేశారు.

అతను 1910 సంవత్సంలో యునైటెడ్ కింగ్‌డమ్ (UK) నుండి తన సొంత డబ్బుతో మొదటి ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారు.

మహారాజా భూపిందర్ సింగ్ 1900-1938 వరకు దాదాపుగా 38 సంవత్సరాలు పంజాబ్‌లోని పాటియాలా ప్రాంతాన్ని పాలించారు.