ఈజిప్ట్ అతి ప్రాచీన నగరాలు ఇవే..

TV9 Telugu

16 April 2024

ఈజిప్ట్ ఆఫ్రికా ఈశాన్య మూలలో, ఆసియాలోని నైరుతి మూలలో ఉన్న సినాయ్ ద్వీపకల్పంలో విస్తరించి ఉన్న ఒక ఖండాంతర దేశం.

ఈ దేశం పేరు చెప్పగానే గుర్తు వచ్చేది ప్రాచీన పిరమిడ్స్. అయితే ఈజిప్ట్ లో అత్యంత ప్రాచీన నగరాలేంటో తెలుసుకుందాం.

ప్రస్తుత గిర్గా అప్పట్లో థినిస్‌గా పిలవబడేది. దీన్ని 3273 BC నుంచి 2987 BC వరకు ఈజిప్టు మొదటి ఫారో నార్మెర్ రాజధానిగా పరిపాలన సాగించాడు.

తర్వాత ఫైయుమ్ ను షెడెట్ వలెగా ప్రాచీన ఈజిప్ట్ లో పిలిచేవారు. ఇది 2686–2181 BC మధ్య పాత రాజ్యంగా తీరు స్థాపించబడింది.

ఇప్పటి లక్సోర్ వాసెట్‌గా ప్రాచీన ఈజిప్ట్ సమయంలో ప్రసిద్ధి. 2150 BC మొదట ఎగువ ఈజిప్ట్ రాజధానిగా స్థాపించబడింది.

వాసెట్‌ నగర థెబ్స్ తరువాత రోమన్ కాలంలో క్షీణించే వరకు దేశానికి మతపరమైన రాజధానిగా ఓ వెలుగు వెలిగింది.

ప్రస్తుత అస్వాన్ స్వెనెట్ గా ప్రాచీన ఈజిప్ట్ సమయంలో పేరు గాంచింది. ఇది చివరికాలంలో 664–332 BC మధ్య ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అలెగ్జాండ్రియా పురాతన ఈజిప్ట్ కి సంబంధించింది. ఇది 332 BCలో అలెగ్జాండర్ ది గ్రేట్ చేత రాకోటిస్ పట్టణంలో స్థాపించబడింది.