ఆవు ఏ దేశానికీ జాతీయ జంతువు తెలుసా.?

TV9 Telugu

15 May 2024

అన్ని దేశలకి ఓ జాతీయ జంతువు ఉంటుంది.ఆ దేశ విశిష్టను లేదా చరిత్రను తెలిపేలా ఓ జంతువును జాతీయ జంతువు ఎంచుకుంటారు.

మన దేశానికి జాతీయ జంతువు పెద్దపులి. అలాగే హిందువులు పవిత్రంగా భావించే ఆవు కూడా ఓ దేశానికి జాతీయ జంతువుగా ఉంది.

ఆవు హిందువులకు చాల పవిత్రమైనది. అవును పూజిస్తే స్వర దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. దీనిని కామధేనువుగా చెబుతారు.

ఆవు లేకపోతే హిందువుల కుటుంబాల్లో చాల శుభకార్యాలు కూడా పూర్తికావు. ఆవు ఉంటె అంత మంచి జారుతుందని వారి నమ్మకం.

ఆవు పాల నుంచి పేడ వారు అన్నింటిలోను ఔషధగుణాలు ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఆవు ఓ దేశానికి జాతీయ జంతువుగా ఉంది.

ఆవు జాతీయ జంతువుగా ఉన్న దేశం ఏంటో అని ఆలోచిస్తున్నారా..? అంత ఆలోచించకండి.. ఇప్పడు మనం తెలుసుకుందాం రండి.

అది మన పొరుగు దేశమైన నేపాల్. అవునండి నేపాల్ జాతీయ జంతువు ఆవు. ఇది హిందూ దేశం. అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి.

నేపాల్ ప్రజల్లో 81.19 శాతం మంది హిందులే ఉన్నారు. అదే భరత్ లో 79.8 శాతం హిందువులతో రెండో స్థానంలో ఉంది.