అంబానీ ఇంట్లో పనిచేసే సేవకులకు జీతాలు ఎంతో తెలుసా?
TV9 Telugu
13 July 2024
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ రాయల్ వెడ్డింగ్‌కు హాజరయ్యే వీవీఐపీ అతిథికి కోట్ల విలువైన వాచ్ రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు అంబానీ కుటుంబం.
కాశ్మీర్, రాజ్‌కోట్, బనారస్ నుండి ఈ వెడ్డింగ్ వేడుకకి హాజరైన మిగిలిన అతిథులకు రిటర్న్ బహుమతులు అందించారు.
ముఖేష్ అంబానీ తన ఇంట్లో సేవకులకు ఎంత జీతం ఇస్తారనే ప్రశ్నలు ఇప్పుడు చాలామంది ప్రజల మదిలో తలెత్తుతున్నాయి.
ముకేశ్ అంబానీ ఇంట్లో పనిచేసే సేవకులకు భారీ జీతాలు ఉంటాయి. ఎంత అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి..
కార్పొరేట్ ఆఫీసులో పనిచేసే వ్యక్తుల మాదిరిగానే ఇక్కడ పని చేసే వారికీ అనేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కొన్ని మీడియా కథనాల ప్రకారం, ముఖేష్ అంబానీ ఇంట్లో 500 మందికి పైగా సేవకులు పనిచేస్తుంటారని తెలుస్తుంది.
వీరిలో చాలా మంది దాదాపు 1.5 నుండి 2 లక్షల వరకు జీతం పొందుతున్నారు. మెడికల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి