వర్షాలు పడుతోన్న సమయంలో ట్రాన్సఫార్మర్ల వద్ద, విద్యుత్ లైన్ల కింద నిలబడకూడదని సూచిస్తున్నారు.
పశువులు, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుంచి దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
రోడ్లపై నీరు నిల్వ ఉన్న చోట నీటిని తొక్కడం లాంటివి చేయకూడదు. అలాగే నీరు నిల్వ ఉన్న చోట వాహనాలు నడపకూడదు.
విద్యుత్ వైర్లు తెగపడే అవకాశం ఉంటుంది. విద్యుత్ ప్రవహిస్తున్న వైర్లు నీటిలో ఉంటే కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
విద్యుత్ తీగలు తెగిపడిన దారుల్లో ప్రయాణం చేయకపోవడమే ఉత్తమం. వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు సూచించాలి.
చెట్ల కొమ్మలు విరిగిన దారుల్లోనూ ప్రయాణాలు చేయకూడదు. చెట్ల కొమ్మలు విరిగిన చోట విద్యుత్ తీగలు కూడా తెగి పడే అవకాశం ఉంది.
ఇక వర్షాల సమయంలో ఇంట్లో కరెంట్ హెచ్చుతగ్గులు అవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో వెంటనే మెయిన్ ఆఫ్ చేయాలి.
విద్యుత్‌కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా 1912, 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు 73820 72104, 73820 72106, 73820 71574కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.