మిస్సైల్ మ్యాన్‌గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప ప్రజ్ఞాశాలి అబ్దుల్ కలం. 1931, అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు.
రాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తయ్యాక షిల్లాంగ్ ఐఐఎంలో అధ్యాపకుడిగా చేరారు. 2015 జూలై 27న షిల్లాంగ్ ఐఐఎంలో లెక్చర్ ఇస్తూ.. విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు.
అబ్దుల్ కలామ్ వర్ధంతి పురస్కరించుకుని ఆయన చెప్పిన కొన్ని అద్భుత సూక్తులు ఒకసారి గుర్తు చేసుకుందాం..!
'జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే.. జయాలను ఆస్వాదించగలం' అని అందరికి చాలాసార్లు చెప్పేవారు అబ్దుల్ కలాం.
'మన జననం సాధారణమైనదే.. కానీ, మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి' అని అన్నారు అబ్దుల్ కలాం.
ఒక మంచి పుస్తకం.. వందమంది మిత్రులతో సమానం.. కానీ, ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. - అబ్దుల్ కలాం
మీరు మీ భవిష్యత్తును మార్చలేరు. కానీ, మీ అలవాట్లను మార్చుకోగలరు. మీ అలవాట్లు.. మీ భవిష్యత్తును మారుస్తాయి. - అబ్దుల్ కలాం
'ఏ ప్రయత్నం చేయకపోతే.. విజయం దగ్గరకు రాదు. మీరు ప్రయత్నిస్తే.. ఓటమి దరిచేరద' అని తెలిపారు అబ్దుల్ కలాం.
'ఎవరినైనా తెలిగ్గా ఓడించవచ్చు.. కానీ, వారి మనసును గెలవాలంటే మాత్రం.. ఎంతో శ్రమించాలి' - అబ్దుల్ కలాం
'అందం ముఖంలో ఉండదు.. సాయం చేసే మనసులో ఉంటుంది', 'సక్సెస్ అంటే.. మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే!' - అబ్దుల్ కలాం
కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు.. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి.. నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి.. నిన్ను సాధించడం కష్టమని. - అబ్దుల్ కలాం