TV9 Telugu
మంచు పాన్పుపై ఎలుగుబంటి ఫోటో వైరల్..
14 Febraury 2024
సాధారణంగా భూమిపై ప్రతి ఒక్కరు చలిగా ఉంటె వెచ్చని ప్రదేశాల్లో ఉండటానికి ప్రయతిస్తుంటారు. అక్కడే నిద్రపోతారు.
ఫిబ్రవరి మాసంలో ఇంకా పూర్తిగా వీడని చలిగాలుల రాత్రుల్లో వెచ్చగా కంబళి కప్పుకుని ముసుగు తన్ని పడుకుంటాం.
కానీ ఈ మంచు ఎలుగుబంటి మాత్రం సుఖమనిన ఇదియె గదా అంటూ మంచుపాన్పుపై హాయిగా పడుకుని ప్రపంచాన్ని మరచి నిద్రపోయింది.
మంచు ఫలకం పై నిద్రపోతున్నఎలుగుబంటి ఫొటోను తన కెమెరాలో క్లిక్‌మనిపించారు బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ నీమా సరిఖానీ.
అమెచూర్ ఫొటోగ్రాఫర్ నిమా సరిఖానీ తీసిన ఫొటో పీపుల్స్ ఛాయిస్ సంస్థ చేపట్టిన ఓటింగ్‌లో పాల్గొన్న వేలాది మందికి తెగ నచ్చేసింది.
దాంతో నీమా సరిఖానిని పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేశారు.
ఎలుగుబంటి మంచు ఫలకంపై ప్రశాంతంగా ఎంతో క్యూట్‌గా నిద్రిస్తున్న ఫొటోకు "మంచు పాన్పు'' అని నామకరణం చేసారు.
నార్వేకు చెందిన స్వాల్‌బార్డ్ ద్వీపసమూహంలోని ఉత్తర ధృవానికి అత్యంత సమీపంలోని ఐస్‌బర్గ్ వద్ద ఈ ఫొటోను తీశారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి