బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం..
TV9 Telugu
25 April 2024
డెవిల్స్ ట్రయాంగిల్ అని పిలువబడే బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం పశ్చిమ భాగంలో ఉంది.
ఈ ట్రయాంగిల్ వైపుగా ప్రయాణం సాగించిన అనేక విమానాలు, ఓడలు రహస్యమైన పరిస్థితులలో అదృశ్యమయ్యాయని చెప్పబడింది.
1800లో USS పికరింగ్, గ్వాడెలోప్ నుండి డెలావేర్ వరకు ప్రయాణిస్తున్న 91 మందితో తొలిసారి ఇక్కడ నావ అదృశ్యం అయింది.
తర్వాత అధికారకలెక్కల ప్రకారం 2015 వరకు సుమారు 13 నావలు ఇక్కడ అదృశ్యం అయినట్లు సమాచారం. అనధికారంగా మరెన్నో ఉన్నాయి.
1945 జూలై 10 USN, పదకొండు మంది ఇతర సిబ్బందితో పాటు, US నేవీ PBM3S పెట్రోల్ సీప్లేన్ బులో ఆ ప్రాంతంతో అదృశ్యమైన తొలి విమానం.
విమానాల అధికారకలెక్కల విషయానికి వస్తే 11 ఉన్నాయి. 2017లో చివరిగా ఓ విమానం అదృశ్యం అయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఉష్ణమండల తుఫానులు తరచుగా సంభవించే ప్రాంతం కావడంతో ఇలా జరుగుతుందని ఓ శాస్త్రవేత్తల నివేదిగా చెబుతుంది.
అయితే దీనికి కారణం ఈ తుఫానులే అనే రుజువు చేయడంలో విఫలమవుతారు. దీంతో ఈ ప్రాంతంపై రహస్యంపై లోతుగా పరిశోధన మొదలైంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి