భూమి లోపల బంగారాన్ని గుర్తించే మిషన్ ఇదేనట..!

TV9 Telugu

05 February  2024

ప్రపంచవ్యాప్తంగా చాలమంది ఎక్కువగా ఇష్టపడే బంగారాన్ని భూగర్భం నుంచి వెలికితీస్తారనే విషయం మనందరికీ తెలిసిందే!

బంగారు గనుల కోసం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎక్కడ ఉన్నాయో అనేక రకాలుగా తరుచూ అన్వేషిస్తూనే ఉంటారు.

బంగారం ఖచ్చితమైన జాడ కనిపించిన చోటే, మైనింగ్ చేసి అక్కడ భూమిలో ఉన్న బంగారాన్ని బయటకు తీస్తారు అధికారులు.

కొన్నిసార్లు బంగారాన్ని మన దగ్గర భూమిలో కొద్దిగా పాతిపెడతారు. భూమి లోపల బంగారాన్ని కనుగొనడానికి గోల్డ్ డిటెక్టర్ మెషిన్‌ను ఉపయోగిస్తారు.

బంగారాన్ని కనిపెట్టడానికి వినియోగించే గోల్డ్ డిటెక్టర్ మెషిన్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ద్వారా పనిచేస్తుంది.

బంగారాన్ని దాని విద్యుదయస్కాంత సంకేతాల ద్వారా భూమి కింద గుర్తించవచ్చని చెబుతున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు.

బంగారం జాడ కనిపెట్టే గోల్డ్ డిటెక్టర్ ధర రూ.70,000 నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

గోల్డ్ డిటెక్టర్ వాటి పరిధి, పని తీరును బట్టి వాటి ధర నిర్ణయించడం జరుగుతుందని అంటున్నారు భూగర్భ నిపుణులు.