ఎక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటే.. అక్కడే లైసెన్స్
TV9 Telugu
21 May 2024
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా? ఇకపై మీకా బాధ అక్కర్లేదు.
డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కేంద్రం భారీ మార్పులు చేసింది. ప్రైవేటు శిక్షణ సంస్థలే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ చేతికి అందిస్తాయి.
జూన్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ సర్టిఫికెట్ జారీచేసేందుకు అనుమతినిచ్చిన కేంద్రం అందుకు కొన్ని నిబంధనలు విధించింది.
ఆ సంస్థలకు కనీసం ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ డ్రైవింగ్ శిక్షణ కోసం అదనంగా మూడు ఎకరాల భూమి ఉండాలి. సెంటర్ అందరికీ అందుబాటులో ఉండాలి.
శిక్షణ ఇచ్చే వారు కనీసం హైస్కూలు విద్యను పూర్తిచేసి ఉండాలి. డ్రైవింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, టెక్నాలజీపై ప్రాథమిక అవగాహన ఉండాలి.
లైట్ వెహికల్ ట్రైనింగ్‌ను 4 వారాల్లో పూర్తిచేయాలి. ఇందులో కనీసం 29 గంటల శిక్షణ ఇవ్వాలి. థియరీలో 8 గంటలు, ప్రాక్టికల్‌లో 21 గంటల శిక్షణ ఇవ్వాలి.
హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్‌కు ఆరువారాల పాటు కనీసం 39 గంటల ట్రైనింగ్ ఇవ్వాలి. ఇందులో 8 గంటల థియరీ, 31 గంటల ప్రాక్టికల్ తరగతులు ఉండాలి.
లెర్నర్ లైసెన్స్ రూ. 200, లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ రూ. 200 , పెర్మనంట్ లైసెన్స్ రూ. 200, ఇంటర్నేషనల్ లైసెన్స్ రూ. 1000 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి