TV9 Telugu
మరణం ఎవరికైనా బాధాకరమే! కన్నీరు పెట్టిస్తున్న వీడియో!
26 Febraury 2024
ఈ సృష్టిలో మరణం ఏ జీవికైనా ఒకటే. బాధించేది ఒక్కలానే. భావోద్వేగాలు మనుషులకు మాత్రమే సొంతమైన అంశం కాదు..
అన్ని ప్రాణుల్లోనూ అది ఉంటుంది. కాకపోతే మనిషి చేతల ద్వారా, మాటల ద్వారా దానిని వ్యక్తీకరిస్తాడు.. అంతే తేడా!
ఓ కోలా చనిపోయిన కోలాను తన ఒళ్లో పెట్టుకుని రోదిస్తోంది. దానిని తనివితీరా హత్తుకుని తన ప్రేమను చాటుకుంది.
సహచర కోలాను కోల్పోయిన మరో కోలా దానిని పట్టుకుని రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కన్నీళ్లు తెప్పిస్తోంది.
ఈ సీన్ నేరుగా చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్థానికులు కోలా రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారొచ్చి కోలాను తమ రక్షణలోకి తీసుకున్నారు.
చనిపోయింది ఆడ కోలా అని గుర్తించారు. మగ కోలాకు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు.
ఆడ కోలా మరణానికి కారణం తెలియరాలేదు. కోలా అనేవి ఎలుగుబంటిని పోలి ఉండే పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకొనే జీవులు.
దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన కోలా ఎలుగుబంటి రెస్క్యూ గ్రూప్ ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి