ఆల్కహాల్ మాంసాహారమా.? శాఖహారమా.? అనే సందేహం రావడం సర్వసాధారణం. సాధాణంగా ఆల్కహాల్ అనగానే నాన్ వెజ్ అనే భావన కలుగుతుంది. ఇందులో కూడా వెజ్, నాన్ వెజ్ అనే తేడాలున్నాయని మీకు తెలుసా.?
ఆల్కహాల్‌లో వోడ్కా, జిన్, రమ్ వంటివి శాఖాహారంగా పరిగణిస్తారు. దీనికి కారణం ఇవి పండు, చెరుకు వంటి వాటితో తయారు చేస్తారు. అందుకే ఈ డ్రింక్స్‌ను నాన్ వెజ్‌గా పరిగణిస్తారు.
అలాగే వైన్, బీర్ వంటివి మాంసాహారమని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం కొన్ని బీర్ తయారీ కంపెనీలు చేపల మూత్రాశయాల నుంచి సేకరించి ఐసింగ్‌లాస్‌ను తయారీలో ఉపయోగిస్తారు. అందుకే వీటిని నాన్ వాజ్‌గా పరిగణిస్తారు.
అలాగే వైన్, బీర్ తయారీలో గుడ్లను ఉపయోగిస్తారు. అయతే అన్ని బీర్‌ల తయారీలో వీటిని ఉపయోగించరు. కొన్ని వెజ్ బీర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
అయితే ఏది వెజ్.? ఏది నాన్ వెజ్ అనే సందేహం రావడం సర్వసాధారణం. ఇది తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. అందేంటంటే ప్రతీ ఆల్కహాల్ బాటిల్ వెనకాల ఉండే ఒక సింబల్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు.
ఆహార పదార్థాలపై ఎలాగైనే వెజ్, నాన్ వెజ్ విషయాన్ని తెలియజేయడానికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇస్తారు. కానీ ఆల్కహాల్‌పై అలా ఉండదు.
అయితే బాటిల్‌పై ఉండే లేబుల్‌లో ఉన్న వివరాల ఆధారంగా సదరు ఆల్కహాల్ శాఖహారామా.? లేదా మాంసాహారమా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీనిబట్టి ఆల్కహాల్ ఎలాంటిదో అర్థమవుతోంది.