ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ జర్మనీలోనూ చెల్లుబాటు అవుతుంది. అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లిష్ లేదా జర్మీనీలో ఉండాల్సి ఉంటుంది.
ఇక భారతదేశ లైసెన్స్‌తో బ్రిటన్‌లోనూ వాహనాలు నడిపించుకోవచ్చు. అయితే ఈ దేశంలో భారత డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు వ్యాలిడిటీ ఉంటుంది.
ఆస్ట్రేలియాలోనూ ఇండియన్ లైసెన్స్‌ను అనుమతి ఇస్తారు. అయితే దీనికాల వ్యవధి కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లిష్‌లో ఉండాలి.
స్విట్జర్లాండ్‌లోనూ భారత లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. ఇండియన్ లైసెన్స్‌తో ఈ దేశంలో వాహనాలను లీజుకు కూడా తీసుకోవచ్చు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లిష్‌లో ఉండాలి.
ఇండియన్ లైసెన్స్‌లు చెల్లుబాటు అయ్యే మరో దేశం దక్షిణాఫ్రికా ఒకటి. అయితే లైసెన్స్ కచ్చితంగా ఇంగ్లిష్‌లో ఉండాలి.
భారతదేశ లైసెన్స్ చెల్లుబాటు అయ్యే మరో దేశం స్వీడన్. మన లైసెన్స్‌తో స్వీడన్‌లోనూ వాహనాలు నడపొచ్చు. లైసెన్స్ ఇంగ్లిష్‌లో ఉండాలి.
హాంకాంగ్‌లోనూ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌లు చెల్లుబాటు అవుతాయి. ఈ దేశంలో మన లైసెన్స్‌తో వాహనాలను అద్దెకు తీసుకొని చక్కర్లు కొట్టొచ్చు.