భూమి అడుగున భారీ మహాసముద్రం!

TV9 Telugu

03 April 2024

భూమి క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనే మూడు పొరలుగా ఉంటుందని మనకు తెలిసిందే! తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్న పరిశోధకులు.

భూమికి సుమారు 700 కిలోమీటర్ల అడుగున ఓ భారీ మహాసముద్రం ఉందని గుర్తించారు జియోగ్రాఫికల్ శాస్త్రవేత్తలు.

ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్. రింగ్వుడైట్ అనే రాయి లోపల భారీ స్థాయిలో నీరు దాగి ఉందని కనుగొన్న పరిశోధకులు.

మొత్తం భూమిపై ఉన్న మహాసముద్రాల్లోని నీటి కంటే 3 రెట్లు ఎక్కువ నీరు అందులో ఉన్నట్లు భావిస్తున్నారు సైంటిస్టులు.

పూర్తి వివరాలను డీహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ మ్యాంటిల్ అనే పరిశోధన పత్రంలో వెల్లడించారు.

పరిశోధన బృందంలో కీలకపాత్ర పోషించిన జియోఫిసిసిస్ట్ స్టీవ్ జాకబ్ సన్. రింగ్వుడైట్ రాయి ఒక స్పాంజిలాగా నీటిని పీల్చుకుంటోంది.

దీని నిర్మాణం ప్రత్యేకంగా ఉందంటున్న శాస్త్రవేత్తలు. హైడ్రోజన్ ను ఆకర్షించడం ద్వారా ఇది నీటిని పట్టి ఉంచుతోందని స్టీవ్ జాకబ్ సన్ వెల్లడి.

భూమి పొరల్లో దాగి ఉన్నీఈ నీటి జాడ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శాస్ర్తవేత్తలు. అధ్యయనం చేపట్టిన తర్వాత పరిశోధకులు భూమి అడుగున నీటి జాడ గుర్తింపు.