అగ్నివీర్ సైన్యంలో చేరాలంటే ఎలా..?

TV9 Telugu

15 July 2024

భారతదేశంలో అగ్నిపథ్ పథకం కింద, త్రివిధ దళాల్లో అగ్నివీర్ సైనికులను నియమిస్తారని అందరికి తెలిసిన విషయమే.

ఈ సైనికులు 4 సంవత్సరాల పాటు బోర్డుర్ లో దేశ భద్రత కోసం సేవలు అందిస్తారు. తర్వాత విధులనుంచి తప్పుకుంటారు.

త్రివిధ దళాల్లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్ వంటి రిక్రూట్‌మెంట్ కింద ఇతర పోస్టులు ఉన్నాయి.

ఇండియన్ ఆర్మీలో పనిచేసేందుకు సైనికులుగా అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రధానంగా 2 దశల్లో పూర్తవుతుంది.

ముందుగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించిన అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనాల్సి ఉంటుంది.

దీని తర్వాత భౌతిక ప్రమాణాలు, సమర్థత పరీక్ష ఉంటుంది. దీనిలో కూడా ఉత్తీర్ణత సాధిస్తేనే తర్వాత అనుమతి ఉంటుంది.

ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసిన తర్వాత తుది మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

ఇందులో రిక్రూట్‌మెంట్ కావాలంటే కనీస వయస్సు 17.5 నుండి 21 సంవత్సరాలు కచ్చితంగా ఉండాలని అధికారులు తెలిపారు.