15 అడుగుల రెక్కలు, జిరాఫీ అంత ఎత్తు.. ఇలాంటి జీవి గురించి విన్నారా..?

TV9 Telugu

17 June 2024

ఒకప్పుడు భూమిపై ఒక జీవి ఉండేది. దాని ఎత్తు జిరాఫీ కంటే ఎక్కువ. దాని రెక్కల పొడవు 15 అడుగుల వరకు ఉంటుంది.

దీని శిలాజాలు ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల్లో కనుగొన్నారు. ఇది టెరోసార్ అంటే డైనోసార్ జాతికి చెందినది గుర్తించారు.

ఇటీవల వాటి శిలాజాలు అంటే ఎముకలు దొరికాయి. వాటి ద్వారానే ఈ జివి నివసించిందని వెల్లడించారు పరిశోధకులు.

పరిశోధకుడు అడెలె పెంట్‌ల్యాండ్ 100 మిలియన్ సంవత్సరాల పాటు ఈ భయంకరమైన ప్రెడేటర్ సగం ప్రపంచాన్ని పాలించిందని చెప్పారు.

పెంట్‌ల్యాండ్ ప్రకారం, ఈ ఎగిరే జీవులు బ్రెజిల్, ఇంగ్లాండ్, మొరాకో, చైనా, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ దేశాల్లో నివసించినట్లు పేర్కొన్నారు.

ఈ పురాతన జీవి ఎముకలను కనుగొన్న ఘనత ఆస్ట్రేలియా దేశానికి చెందిన పరిశోధకుడు కెవిన్ పీటర్సన్‌కు దక్కుతుంది.

ది సన్ నివేదిక ప్రకారం, మరొక శిలాజాన్ని పరిశీలించినప్పుడు ఈ ఎముకలను కనుగొన్నారు. డైనోసార్లతో పాటు ఈ విధ్వంసక జీవి కూడా భూమి నుండి అంతరించిపోయింది.

66 మిలియన్ సంవత్సరాల క్రితం, భూమి జంతు జాతులలో మూడు వంతులు ఓ విపత్తులో నాశనమయ్యాయని సైన్స్ నమ్ముతుంది.