ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్.. ఇదే నయా ట్రెండ్..
TV9 Telugu
15 May 2024
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్. జపాన్‌లో ప్రస్తుతం ఈ ట్రెండ్ ఊపందుకుంది.
జపాన్ యువత పెళ్లిళ్లు చేసుకోవడం లేదు పిల్లల్ని కనడం లేదు. అక్కడి గ్రామాలలో కొన్ని లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు తాజాగా వార్తలొచ్చాయి.
ఆర్థిక, కెరీర్ పరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న జపాన్ యువత పెళ్లి మాట అంటేనే విముఖత చూపిస్తున్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారింది.
దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్‌ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి.
ఈ విధానంలో.. ప్రేమ లేదా లైంగిక సంబంధానికి అవకాశం లేదు. ఒకే మనస్తత్వం ఉన్న వారితో స్నేహంగా జీవించడం జరుగుతుంది.
చట్టపరంగా వీళ్లు దంపతులే అయినప్పటికీ.. కొందరు కలిసి జీవిస్తే.. మరికొందరు వేర్వేరుగా ఉంటారు. పిల్లలు కావాలనుకుంటే.. కృత్రిమ గర్భధారణ ట్రై చేస్తారు.
పరస్పర అంగీకారం ఉన్నంతకాలం తమకు నచ్చిన వారితో ఇద్దరూ స్వేచ్ఛగా ఉండొచ్చు. సంప్రదాయ వివాహ బంధంపై ఆసక్తి లేనివారు దీనివైపు అడుగులు వేస్తున్నారు.
మొత్తం 12 కోట్లకు పైగా జనాభా ఉన్న జపాన్‌లో ఇలాంటి వారు దాదాపు ఒక శాతం మంది ఉంటారట. అంటే సుమారు 12 లక్షల మంది ఉన్నట్లు అంచనా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి