దుబాయ్ వీధుల్లో పెంగ్విన్‌ల 'వరద'

TV9 Telugu

26 January 2024

మీరు మొబైల్ కానీ టీవీల్లో గానీ పెంగ్విన్‌ని చాలామంది కచ్చితంగా చూసే ఉంటారు. ఇవి చాలా అందంగా కనిపిస్తాయి.

అంటార్కిటికా ఖండంలో ఎక్కువగా కనిపించే పెంగ్విన్‌లు నిజానికి పక్షులే, కానీ వాటికీ ఎగిరే సామర్థ్యం లేదు.

ఒక్కసారి ఊహించుకోండి, ఈ పెంగ్విన్‌లు ఎడారి నగరమైన దుబాయ్‌లో నివసించడం ప్రారంభించి, వీధుల్లో సంచరిస్తుంటే ఎలాంటి దృశ్యం ఉంటుందో?

దుబాయ్ దేశం వీధుల్లో పెంగ్విన్‌ల 'వరద' పారింది. వాటి కారణంగా భారీ అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఈ అందమైన చిత్రాలు AI సహాయంతో రూపొందించడం జరిగింది. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ చిత్రాలు రూపొందించారు.

ఈ పెంగ్విన్‌ల చిత్రాలు jyo_john_mulloor అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Instagramలో షేర్ చేయడం జరిగింది.

ఈ చిత్రాలను చూసిన తర్వాత కొందరు నెటిజన్లు అయోమయంలో పడ్డారు. 'ఇది నిజమేనా' అని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.

అయితే కొంతమంది మాత్రం 'భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు' అంటూ ఈ పోస్టును టాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.