కలర్‌ని బట్టి క్యారెక్టర్ తెలుసుకోవచ్చు, ఎలా అంటే..?

17 August 2023

ఎరుపు రంగును ఇష్టపడేవారిలో ఏకాగ్రత ఎక్కువ. ఏ విషయమైనా తడబాటు పడకుండా నిగ్రహంగా ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ.

గులాబీ రంగును ఇష్టపడేవారు సహజంగానే చమత్కార గుణాన్ని కలిగి ఉంటారు. చుట్కటు ఉన్నవారిని నవ్విస్తూ ప్రశాంత వాతావరణంలో సమయాన్ని గడుపేందుకు ఇష్టపడతారు.

ఆరెంజ్ రంగును ఇష్టపడేవాళ్లు చాలా వరకు ఆశావాదులై ఉంటారు. నలుగురితో కలిసి మెలిసి ఉండే గుణాన్ని వీరు కలిగి ఉన్నందున, అందరూ వీళ్లని ఇష్టపడతారు.

తెలుపు రంగును ఇష్టపడేవారు ప్రతి విషయం సులువుగా ఉండాలని, క్రమపద్ధతిలో జరిగిపోవాలని భావిస్తుంటారు. ఒంటరిగా ఉండేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు.

నలుపును ఇష్టపవేవారు ప్రైవసీ ప్రేమికులు. సెల్ఫ్ కంట్రోల్‌ కలిగి ఉండడంతో పాటు ఎప్పుడూ ఇతరులను మర్యాదపూర్వకంగా పలకరిస్తారు.

ఆకుపచ్చ రంగును ఇష్టపడేవారు సహజంగా ప్రకృతి ప్రేమికులు అయి ఉంటారు. చుట్టూ ఉన్న పచ్చని పరిసరాల్లో తేలియాడుతూ ఉంటారు.

నీలం రంగును ఇష్టపడేవారు అమర ప్రేమికులు, నిజాయితీ కలిగినవారై ఉంటారు. ముఖ్యంగా వీరు స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

బూడిద రంగును ఇష్టపడేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇక వీళ్లు చాలా ప్రశాంతంగా, ఇతరుల విషయాలకు దూరంగా ఉంటారు. తమ సొంత కాళ్లపైనే నిలబడాలనే పట్టుదల కలిగినవారు.

ఊదా రంగును ఇష్టపడేవారు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. ప్రతి విషయాన్ని పరిశీలనగా, సృజనాత్మకంగా ఆలోచిస్తారు.