TV9 Telugu
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు మెటా షాక్!
14 Febraury 2024
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో రాజకీయ నేతలకు దిమ్మతిరిగే షాకిచ్చిన సోషల్ మీడియా దిగ్గజం మెటా.
ఫేస్‌బుక్‌లోని అవాంఛిత పొలిటికల్ కంటెంట్‌కి త్వరలోనే కళ్లెం వేసే దిశగా అడుగులు వేస్తోన్న మెటా సంస్థ.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లపై సీరియస్.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్న ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా.
పొలిటికల్ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో రెకమెండ్ చేయబోమంటూ కీలక ప్రకటన చేసింది.
రాజకీయ కంటెంట్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని, కంటెంట్‌ను పోస్ట్ చేసే ఖాతాలను ఫాలో చేసేవారిని తాము ఏ మాత్రం అడ్డు రాబోమని స్పష్టత.
యాప్‌లలో రాజకీయ కంటెంట్ సిఫార్సులను చూడాలా వద్దా అన్నది యూజర్ల ఇష్టం. ఎంపిక చేసుకోవడానికి మెటా సెట్టింగ్.
ఇకపై పొలిటికల్ కంటెంట్ అందరికీ చేరదు. పొలిటికల్ అకౌంట్లు, పేజీలు ఫాలో అవుతున్నవారికి మాత్రమే ఆ కంటెంట్ చేరుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి