12 ఉంటేనే డజన్‌ అని ఎందుకుంటారో తెలుసా.? 

22 August 2023

అరటిపండ్లను, కోడిగుడ్లను డజన్లలా లెక్కించడం ఎన్నో ఏళ్ల క్రితం నుంచి వస్తుంది. దీని వెనక డ్యూడెమికల్ సిస్టం ఉంటుంది. 

పూర్వం చేతి వేళ్ల ఆధారంగా లెక్కించే వారు. బొటన వేలు మినహా మిగతా చేతి వేళ్ల గీతలను లెక్కిస్తారు. బొటన వేలు మినహాయిస్తే 12 ఉంటాయని తెలిసిందే. 

ఇలా లెక్కించడం సులభమైన పద్ధతి కావడంతో 12కి లెక్కించడం అలవాటుగా మారింది. 

కాలక్రమేణ దీనినే డజన్‌గా లెక్కించడం ప్రారంభించారు. ఇదే అలవాటుగా మారిపోయింది. 

ఇక అర డజన్‌ అంటే కూడా సింపుల్‌గా లెక్కించవచ్చు. 12లో సగం ఉంటే అరడజన్‌గా పరిగణించారు. 

డజన్‌లో 12 ఉండడానికి మరో కారణం..12ను మూడు భాగాలుగా సులభంగా విభజించవచ్చు.  

6,6 లేదా 4,4,4 లేదా 3,3,3,3లాగా సులభంగా విభజింవచ్చు. కాబట్టే డజన్‌లలో లెక్కించడం ప్రారంభించారని చెబుతారు. 

ఒకవేళ డజన్‌లో 12 కాకుండా 10 లేదా 15 ఉంటే ఇలా ఇన్ని భాగాలుగా సమానంగా విభజించడం కూదరకపోవడం కూడా ఒక కారణంగా చెబుతారు.