రైల్వే ట్రాక్ పక్కన C/F, W/L బోర్డులు ఎందుకో తెలుసా?

TV9 Telugu

27 March 2024

భారతీయులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ సాధనం రైలు. అత్యధిక శాతం తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు రైలునే ఎంచుకుంటారు.

అతి తక్కువ ధరలో ఉత్తమ మార్గంగా రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తుంటారు దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రయాణికులు.

రైలులో కూర్చున్నట్లయితే, మీరు రైల్వే లైన్ వైపున C/F, W/L అనే గుర్తు ట్రాక్ వెంట పసుపు బోర్డుపై కనిపిస్తుంటాయి.

రైల్వే ట్రాక్‌ల వెంట ప్రతిచోటా C/F, W/L అని రాసి ఉంటుంది. ఈ బోర్డు ఎందుకని మీరు ఎప్పుడైనా గమనించారా ?

C/F , W/L అనే బోర్డులు భద్రతా కోణంలో చాలా ముఖ్యమైన సైన్‌బోర్డ్‌లు. ఇది రైల్వే క్రాసింగ్ కోసం ఒక విజిల్ సమాచారం.

బోర్డు ఉన్న ప్రాంతానికి రైలు చేరుకోగానే లోకో ఫైలట్ తప్పనిసరిగా హారన్ మోగించాలని ఈ సైన్ బోర్డు సూచిస్తుంది.

సాధారణంగా ఈ సైన్ బోర్డు రైల్వే క్రాసింగ్ నుండి దాదాపు 250-600 మీటర్ల లోపల మాత్రమే ఏర్పాటు చేయబడి ఉంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ బోర్డులు ప్రమాదాలను నివారించడంలో రైల్వేలే కాకుండా సామాన్యులు కూడా సహకరిస్తాయి.