నోబెల్ అవార్డ్ అందుకున్న అతి పిన్న వయస్కుడెవరో తెలుసా?

TV9 Telugu

09 October 2024

నోబెల్ బాహుమతి సైన్స్, వైద్యం, విద్య, సాహిత్యం వంటి వాటిల్లో అద్బుతమైన ప్రతిభను చూపించిన వారికి ఇస్తారు.

నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. అయితే ఈ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడెవరో తెలుసా?

అతి పిన్న వయసులో నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడు అభిజిత్ బెనర్జీ. అతను 2019 లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.

అభిజీత్ అనే వ్యక్తి 58 సంవత్సరాల వయస్సులో 2019 సంవత్సరంలో ఎకనామిక్స్ సైన్స్‌లో అవార్డును అందుకున్నారు.

అభిజిత్ బెనర్జీ పావర్టీ యాక్షన్ ల్యాబ్ సహ వ్యవస్థాపకులు. పేదరికాన్ని అరికట్టడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అభిజిత్ బెనర్జీ ముంబైలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఎకనామిక్స్ ప్రొఫెసర్లు. అభిజీత్ కూడా ఇదే సబ్జెక్టులో అనేక విజయాలు సాధించారు.

అభిజిత్ బెనర్జీ కలకత్తా యూనివర్సిటీ, ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్శిటీలో చదువుకున్నారు. అంతే కాకుండా, అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు.

నోబెల్ బహుమతిని గెలుచుకున్న భారతీయులలో రవీంద్రనాథ్ ఠాగూర్, హరగోవింద్ ఖురానా, వెంకటరామన్ రామకృష్ణన్, కైలాష్ సత్యార్థి, అమర్త్యసేన్,చంద్రశేఖర్ వెంకటరామన్ ఉన్నారు.