డబ్బుకు బదులు రాళ్లు వాడే దేశం ఏంటో తెలుసా ?

TV9 Telugu

01 April 2024

ప్రపంచంలో ఉన్న ఓ దేశంలో లావాదేవీల కోసం కరెన్సీ ఉపయోగించారు. ఈ దేశం పేరు మైక్రోనేషియా. పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ద్వీప దేశం.

పసిఫిక్ మహాసముద్రంలో ఇండోనేషియా దేశానికి సమీపంలోని ఉన్న యాప్ ద్వీపాల్లోని ప్రాంతమే మైక్రోనేషియా ద్వీప దేశం.

పశ్చిమ పసిఫిక్ మహా సముద్రం అంతటా ఉన్న నాలుగురాష్ట్రాలతో దాదాపు 607 ద్వీపాలతో ఏర్పడింది మైక్రోనేషియా దేశం.

ఈ దేశంలో రాయ్ అనే భారీ వృత్తాకార రాయితో లావాదేవీలు జరుగుతాయి. ప్రత్యేకంగా ఓ కరెన్సీ అంటూ ఇక్కడ లేదు.

రాయ్ అనే రాయి పరిమాణం, వ్యాసం బట్టి ఈ దేశంలో విలువ ఎంతన్నది నిర్ణయిస్తారు అక్కడ నివసిస్తున్న ప్రజలు.

2000 సంవత్సరాల కంటే ముందునుంచే మైక్రోనేషియాలో ఈ పద్దతి మొదలైంది. అప్పటినుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఈ ఐలాండ్‌ దేశంలో యునైటెడ్ స్టేట్స్ డాలర్లు కూడా లావాదేవీల కోసం ఇక్కడి ప్రభుత్వం అంగీకరించడం జరుగుతుంది.

మైక్రోనేషియాలో చెలామణి అయ్యే రాళ్లను పలావు ద్వీపం నుంచి తెప్పించారు. కొన్ని సాంప్రదాయ వేడుకల్లో కూడా రాయ్ రాళ్లను ఉపయోగిస్తారు.