భారత సైనికులు ఎలాంటి ఆయుధాలను ఉపయోగిస్తున్నారో తెలుసా..?

TV9 Telugu

10 November 2024

భారత సైనికులు వివిధ రకాల ఆయుధాలను ఉపయోగిస్తారు. వారు ఏయే ఆయుధాలను ఉపయోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకోండి.

భారత సైనికులు ఉపయోగించే వాటిలో 'INSAS రైఫిల్' ఒకటి. ఇది భారత సైన్యం ప్రధాన దాడి రైఫిల్, ఇది విస్తృతంగా ఉపయోగిస్తారు.

'AK-203' అనే ఆయుధం ఆధునిక అసాల్ట్ రైఫిల్, ఇది మిత్ర దేశం రష్యా సహకారంతో భారతదేశంలో తయారు చేయడం జరిగింది.

భారత సైనికుల ఆయుధాల్లో 'సిగ్ సాయర్ 716' ఒకటి ఉంది. ఇది హై కాలిబర్ రైఫిల్, దీనిని భారత సైన్యం ఉపయోగిస్తుంది.

'M-777 హోవిట్జర్' ఆయుధం తేలికపాటి ఫిరంగి, దీనిని భారతదేశ సైన్యం యుద్ధ సమయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంది.

'పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్' చాల శక్తివంతమైన రాకెట్ లాంచర్. దీన్ని చూస్తే శత్రువుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే.

'బ్రహ్మోస్ క్షిపణి' సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి, దీనిని భారత్‌ - రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

భారత సైన్యంలో మరో అద్భుత ఆయుధం 'అర్జున్ ట్యాంక్'. ఇది స్వదేశంలో తయారు చేసిన ప్రధాన యుద్ధ ట్యాంక్.