ఏలియన్స్ ఏ రంగులో ఉంటాయో తెలుసా..?

TV9 Telugu

27 May 2024

గ్రహాంతరవాసులను ఎప్పుడూ పచ్చగా ఎందుకు వర్ణిస్తారని ఎప్పుడైనా మీరు ఆలోచించారా..? ఈ సందేహం మీకు వచ్చిందా.?

గ్రహాంతరవాసులు ఆకుపచ్చ రంగు కథ ఇప్పటిది కాదు.. 12 వ శతాబ్దం నాటిది. ఇది యూరప్‌లోని వూల్‌పిట్ అనే పల్లెటూరి కథ.

యూరప్‌ ఖండానికి చెందిన ఈ కథ పేరు ది గ్రీన్ చిల్డ్రన్ ఆఫ్ వూల్‌పిట్. ఆ కథలో పచ్చటి చర్మంతో జన్మించిన పిల్లవాడు పచ్చివి మాత్రమే తింటాడు.

కానీ ఆ పచ్చరంగు పిల్లలకు అక్కడి స్థానిక భాష కూడా తెలియదు, వారు సెయింట్ మార్టిన్ ల్యాండ్ నుండి వచ్చారు.

అయితే కొద్దిసేపటికే ఇద్దరు చిన్నారుల్లో ఒకరు మృతి చెందారు. అప్పటి నుండి గ్రహాంతరవాసులను ఆకుపచ్చ రంగులో చూపించారు.

వాస్తవానికి గ్రహాంతరవాసుల రంగు ఆకుపచ్చగా ఉండదు. వివిధ రంగులలో ఉండవచ్చని రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ వెలువరించిన పరిశోధనలో పేర్కొన్నారు.

గ్రహాంతరవాసులు బాక్టీరియాతో కప్పబడి ఉండటం వల్ల అవి ఊదా రంగులో ఉండవచ్చని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు.

వారి గ్రహం కాంతిని తక్కువగా కలిగి ఉండవచ్చని కూడా వారు ఊహిస్తారు. దీని కారణంగా ఏ రంగులో ఉంటారో స్పష్టంగా చెప్పలేము.