దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని చాణక్యపురి నుంచి 7కిలో మీటర్ల దూరంలో తీహార్ అనే గ్రామంలో ఈ తీహార్ జైలు ఉంది.
దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద కారాగార ప్రాంగణం. కిరణ్ బేడీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగి తీహార్ ఆశ్రమంగా పేరు పొందింది.
తన సుదీర్ఘ చరిత్రలో అనేక మంది ప్రముఖులకు ఆశ్రయమిచ్చింది తీహార్ జైలు. ఎమ్మెల్సీ కవిత, సత్యేంద్ర జైన్ నుండి సంజయ్ సింగ్ వరకు అందరూ ఈ జైలులోనే ఉన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించి తీహార్ జైలు వార్తల్లో నిలుస్తోంది. అయితే తీహార్ జైలులో ఎంత మంది ఖైదీలు ఉండవచ్చో తెలుసా ?
వాస్తవానికి, మొత్తం తీహార్ జైలు సామర్థ్యం 10,026 సరిపోయే వసతులున్నాయి. అయితే 2019 సమయంలో జైలులో 17,534 మంది ఖైదీలు ఉన్నారు.
ఇక్కడ అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద జైళ్లలో తీహార్ జైలుకు పేరుంది.
ఎందరో రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్ర వాదులు, ఉద్యమ నాయకులు వారెందరో ఈ జైలులో ఉన్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులోని కేహార్ సింగ్, సత్వంత్ సింగ్‌లను ఈ జైలులోనే ఉరి తీశారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ అఫ్జల్ గురును ఇక్కడే ఉరితీశారు.