పానీపూరీకి ఎన్ని పేర్లున్నాయో తెలుసా..? భారత్‌లోనే ఒక్కో చోట ఒక్కో పేరు..
న్యూఢిల్లీ, పంజాబ్, జమ్మూకశ్మీర్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో పానీపూరీని గోల్‌గప్ప అంటారు.
బిహార్, జార్ఖాండ్, వెస్ట్ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాల్లో పానీపూరీకి పుచ్కా అని పేరు.
యూపీ, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీనికే ఫుల్కీ అని పేరు.
గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో దీన్ని పానీపూరీ అనే పిలుస్తారు.
గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీన్ని పకోడి అని అంటారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలిఘర్‌లో దీనికి పడక అని పేరు.
ఒడిశా, బిహార్, జార్ఖాండ్, చత్తీస్ఘఢ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పానీపూరీని గప్‌చుప్ అంటారు.
ఉత్తరప్రదేశ్‌లో కొన్ని చోట్ల దీన్ని పానీ కే పటాషే అంటారు.
రాజస్థాన్, యూపీలో పానీకే బాతాషే, పానీకే పాటాషీ అని పిలుస్తారు.
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో దీన్ని టిక్కీ అని కూడా అంటారు.
ఇక్కడ క్లిక్ చేయండి..