తెలుగు రాష్ట్రాలను త్రిలింగ ధామం అంటారని తెలుసా.?
TV9 Telugu
11 July 2024
తెలుగు రాష్ట్రాలు అనేక పుణ్య క్షేత్రాలకు, పర్యాటక ప్రదేశాలకు చాలా ప్రసిద్ధి చెందాయి. ఏటా చాలామంది పర్యటనకి వస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పుణ్య క్షేత్రాలకు ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది.
ఇక్కడ క్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలను ఏళ్లనాటి చరిత్ర ఉంది. హిందూ, బౌద్ధ క్షేత్రాలతో అనేక మతాల సమ్మేళనం తెలుగు రాష్ట్రాలు.
ఇదిలా ఉంటె తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం క్షేత్రాల కారణంగా త్రిలింగ ధామం (మూడు లింగాల దేశం) అంటారు.
ఈ త్రిలింగ క్షేత్రాల ఉన్న ప్రదేశాలను కలిపితే త్రిభుజం వస్తుంది. త్రిలింగ నుంచే తెలుగు అన్న పదం ఏర్పడిందని పండితుల చెబుతున్నారు.
త్రిలింగ క్షేత్రాల్లో ఒక్కటైన శ్రీశైలం ఏపీలోని నంద్యాల జిల్లాలో తెలంగాణ సరిహద్దు ప్రాంతం. ఇది మల్లికార్జున స్వామి స్వామి క్షేత్రం.
పంచారామ క్షేత్రాల్లో ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ శివుడు శ్రీ భీమేశ్వర స్వామిగా దర్శనం ఇస్తాడు.
సర్వేశ్వరుడు కాళేశ్వరునిగా, ముక్తేశ్వరునిగా కొలువై ఉన్న క్షేత్రం కాళేశ్వరం. ఇది త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి