బీర్‌ను అల్కహాల్‌గా పరిగణించని దేశం ఏదో తెలుసా..?

TV9 Telugu

18 March 2024

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆల్కహాల్‌లో సగానికి పైగా బీరు రూపంలో తయారవుతోందని చాలామందికి తెలిసిన విషయమే.

దాదాపు ప్రతి దేశంలోనూ రోజురోజుకు బీర్ తాగేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తాజాగా కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

పాశ్చాత్య దేశాల్లో ఆల్కహాల్ కంటెంట్ ఉన్న బీరుని ఎక్కువగా నిత్యవసర వస్తువుగా వినియోగిస్తారని తెలిసిందే.

బీర్‌లో వైన్‌తో సమానమైన ఆల్కహాల్ ఉంటుందన్న విషయం మీకు తెలుసా..? ఇది నిజమని చెబుతున్నారు అధ్యయనకారులు.

ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల్లో బీర్‌ను ఆల్కహాల్‌గా పరిగణించరు. అందుకే నిత్యవసర వస్తువుగా భావిస్తారు.

మన పొరుగు దేశం రష్యా 2011 వరకు బీర్‌ను ఆల్కహాల్‌గా పరిగణించలేదు. బీర్‌ను కేవలం శీతల పానీయంగా తాగేవారు.

ప్రస్తుతం రష్యాలో కూడా బీరును మద్యంగా పరిగణించన్నప్పటికీ, బీర్‌లో వైన్ కంటే తక్కువ ఆల్కహాల్ ఉంటుందట.

ఏ రూపంలోనైనా మద్యం సేవించడం హానికరం. అల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. అందుకే దీనికి దూరంగా ఉండటం మంచిది.