ఈ దేశాలలో మనం లక్షాధికారులం..

TV9 Telugu

29 March 2024

ప్రపంచంలోని అత్యల్ప కరెన్సీ ఇరానియన్ రియాల్, దీని విలువ సుమారుగా 0.0019 రూపాయిలు. అంటే 1 రూపాయి 509.61 ఇరానియన్ రియాల్ కి సమానం.

భారతదేశంతో వియత్నాం కరెన్సీ కూడా చాలా అల్పంగా ఉంది. ఇక్కడ 1 రూపాయి 297.97 వియత్నామీస్ డాంగ్ తో సమానం.

ఆగ్నేయ ఆసియాలో ఉన్న ఓ బౌద్ధమాత దేశం లావోస్. ఈ దేశంలో మన 1 రూపాయి విలువ అక్షరాల 251.64 లావోషియన్ కిప్.

సియెర్రా లియోన్ పశ్చిమ ఆఫ్రికాలోని నైరుతి తీరంలో ఉన్న దేశం. ఇక్కడ 1 రూపాయి విలువ 238.35 సియెర్రా లియోనియన్ లియోన్.

ఇండోనేషియా కరెన్సీ కూడా భరత్ కరెన్సీ కంటే తక్కువగానే ఉంది. 189.54 ఇండోనేషియా రూపాయి 1 ఇండియన్ రూపాయికి సమానం.

మధ్య ఆసియాలో ఉన్న ఇస్లాం దేశం ఉజ్బెకిస్తాన్. ఈ దేశంలో150.73 ఉజ్బెకిస్తానీ సోమ్ భారత్ 1 రూపాయికి సమానం.

గినియా పశ్చిమ ఆఫ్రికాలోని ఒక తీర దేశం. ఈ దేశంలో భారత్ 1 రూపాయి విలువ విషయానికి వస్తే 103.52 గినియన్ ఫ్రాంక్.

పరాగ్వే దక్షిణ అమెరికాలో భూపరివేష్టిత (తీరం లేని) దేశం. ఇక్కడ 1 రూపాయి 88.05 పరాగ్వే గురానీతో సమానంగా ఉంది.