ఓటర్ ఐడీలో మార్పులు. కొత్త ఓటర్ ఐడీ కోసం https://voters.eci.gov.in/ అనే వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి.
‘షిఫ్టింగ్ ఆర్ రెసిడెన్స్/కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోరల్ రోల్/రిప్లేస్ మెంట్ ఆఫ్ ఈపీఐసీ/ మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ’ అని రాసి ఉన్నచోట క్లిక్ చేయాలి.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మీ ఓటు మార్చేందుకు, ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చేందుకు Form 6 ఉపయోగపడుతుంది.
ఒకవేళ మీరు ఒకే నియోజకవర్గంలో వేరే ప్రాంతానికి మారినట్లయితే ఆ వెబ్‌సైట్‌లో Form 8A పైన క్లిక్ చేయాలి.
సెక్షన్ సీలో మీరు మార్చుకోవాలనుకుంటున్న మీ కొత్త చిరునామాను పూరించి, దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
మార్చుతున్న చిరునామాను తగ్గినట్లుగా వాటర్/గ్యాస్ కనెక్షన్ లేదా ఎలక్ట్రిసిటీ బిల్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ ఇందులో ఏదొక సమర్పించాలి.
ఇండియన్ పాస్ పోర్టు, రెవన్యూ డిపార్ట్ మెంట్ ల్యాండ్ ఓనింగ్ రికార్డు, రిజిష్టర్డ్ రెంట్ లీజ్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది.
పై వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ఒక్కసారి ప్రివ్యూ చూసుకొని వివరాలు సరిగ్గా ఉంటే సబ్మిట్ చేయాలి.