07 August 2023

హైవేపై కారు చెడిపోతే ఏం చేయాలి?

కొన్ని సందర్భాల్లో మనం దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినప్పుడు హైవే మధ్యలో మన కారు బ్రేక్ డౌన్ అవుతుంది.

అలాంటి సందర్భంలో మీకు ఎప్పుడైనా రహదారిపై ప్రయాణించేటప్పుడు జరిగితే.. ఎమర్జెన్సీ లైట్లు వెంటనే ఆన్ చేయాలి.

ఆ రహదారిపై వచ్చే మిగిలిన వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ కారును రోడ్డు పక్కకు పార్క్ చేయాలి.

బ్రేక్ డౌన్ కాగానే.. ఆ కారు ఎటువైపూ కదలకుండా ఉండేందుకు ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఉంచాలి.

మీరు కారు లోపల ఉండాలి. అలాగే ఏదైనా సహాయం చేసేలా కొన్ని సూచనలు చేయాలి. 

ఇతరులకు తెలిసేలా కారు బానెట్‌ను ఓపెన్ చేసి ఉంచాలి. అలాగే సహాయం కోసం ఎదురు చూడాలి.  

కారు దగ్గర రిఫ్లెక్టర్ మొదలైన వాటితో త్రిభుజాన్ని ఉంచండి. అప్పుడే తెలుస్తుంది.. ఇతరులకు మీ కారు ట్రబుల్‌ అయినట్టు తెలుస్తుంది. 

మీ కారు బ్రేక్ డౌన్ అయిన వెంటనే.. రహదారిని పర్యవేక్షిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు వివరాలు తెలియజేయండి. 

మీ చుట్టుప్రక్కల ఎవ్వరూ లేకపోతే.. వెంటనే అందుబాటులో ఉన్న.. అత్యవసర నంబర్‌కి డయల్ చేయండి.

కారు బ్రేక్ డౌన్ కాగానే.. ఇతరుల సహాయం తీసుకోవడంతో పాటు.. మీ బీమా కంపెనీకి కూడా ఫోన్ చేసి సహాయం తీసుకోండి