చాలా మంది పని ఒత్తిడి వల్ల.. లేదా అనేక కారాణాల వల్ల చాలామంది బీర్ తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది యువత బీర్ ప్రియులుగా మారిపోతున్నారు
దీంతో బీర్ అమ్మకాలు పెరిగి బీరు ప్రియులను ఆకట్టుకోవడానికి తయారీ సంస్థలు కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తున్నాయి.
సాధారణంగా ఒకే రకమైన టేస్ట్ ఉన్న బీర్ తాగడం వల్ల చాలామంది ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. అందుకే కొత్త కొత్త ఫ్లేవర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
తాజాగా స్వదేశీ క్రాఫ్ట్ బీర్ కంపెనీ బీరా 91 చట్నీ సోర్‌ను పరిమిత సంఖ్యలో మార్కెట్లో బీర్లను విడుదల చేసింది.
చట్నీ బాగుంటే టిఫిన్ ఎక్కువ లాగించేస్తారు. దీంతో చట్నీ ఫ్లేవర్‌లో బీర్స్ తయారు చేసింది బీరా 91 కంపెనీ. ఈ బీర్ తయారీకి చింతపండును ఉపయోగించారు.
బిరా కంపెనీ 2022లో ' బాలీవుడ్ IPA', 'కోకుమ్ సోర్', 'బ్రౌన్ ఆలే' 'మ్యాంగో లస్సీ' అనే నాలుగు కొత్త రుచులతో బీర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముఖ్యంగా కాలానుగుణంగా లభించే పండ్లు, వివిధ రుచికరమైన పదార్థాలతో బీర్లను తయారు చేయగా ఈ బీర్లకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తోందని సంస్థ తెలిపింది.
EMR నివేదికల ప్రకారం 2023లో భారతీయ బీర్ మార్కెట్ విలువ దాదాపు రూ. 483.10 బిలియన్‌లుగా ఉండగా 2032 నాటికి సుమారు రూ. 1122.52 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.