వేసవి లో తప్పక చూడాల్సిన  అద్భుతమైన ప్రదేశాలు ఇవే

TV9 Telugu

09 April 2024

వేసవి కాలం మొదలైంది.. మరికొన్ని రోజుల్లో పిల్లలకు వేసవి సెలవులు కూడా మొదలవుతాయి. దీనితో పాటు ఫ్యామిలి వెకేషన్స్ కూడా మోదలవుతాయి.

ఈ క్రమంలో సమ్మర్ వెకేషన్ లేదా మీ గర్ల్ ఫ్రెండ్‌తో లేదా భార్యతో ఏకాంతంగా గడిపేందుకు కొన్ని అద్భుతమైన ప్రదేశాలున్నాయి.

'లడాఖ్'  ఇక్కడ ఎత్తైన పర్వతాలు, మంచు కురిసే  ప్రాంతాలు, ప్రశాంత వాతావరణంతో పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. 

పశ్చిమ బెంగాల్  లోని 'డార్జిలింగ్' అత్యంత అందమైన ప్రాంతం. టీ తోటులు, పచ్చపచ్చని కొండ ప్రాంతాలు, టాయ్ ట్రైన్ తో మంచి అనుభూతిగా మలుస్తాయి.

ఉత్తరాఖండ్ 'మసూరీ' కొండలకు రాణిగా పిలుస్తారు. ఇది పచ్చపచ్చని కొండలు, అందమైన సరస్సులకు మసూరీ చాలా ప్రసిద్ధి. 

ఉత్తరాఖండ్ లోని 'నైనితాల్'. నైనీ సరస్సు, కొండ ప్రాంతాలు, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. అందమైన ప్రాంతాలకు ఇక్కడ కొదవ లేదు. 

హిమాచల్ ప్రదేశ్ లోని 'మనాలీ'.  మంచు కురిసే కొండలు, థ్రిల్లింగ్ అడ్వంచర్లు, ప్రశాంత వాతావరణం అన్నింటికీ మనాలీ కేరాఫ్ అడ్రస్.