పాదాలను నేలపై తాకని ప్రత్యేకమైన పక్షి..

TV9 Telugu

23 April 2024

ఈ ప్రపంచంలో చాల పక్షులు ఉన్నాయి. కొన్ని పక్షులు మాత్రం మిగతా వాటికీ విభిన్నంగా ఉంటాయి. అదే వాటిని ప్రత్యేకంగా చూపుతుంది.

భూమిపై అస్సలు ఎప్పడు కూడా కాలు పెట్టడానికి ఇష్టపడని పక్షి ప్రపంచంలో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

పావురంలా కనిపించే 'ఆకుపచ్చ పక్షి' గురించి మీకు తెలుసా..? దీనిని పసుపు పాదాల ఆకుపచ్చ పావురం అని కూడా పిలుస్తారు.

హరియాల్ అని పిలవబడే మహారాష్ట్ర రాష్ట్ర పక్షి ఇది. కానీ ఇవీ ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కనిపిస్తాయి.

అస్సాంలో ఈ పక్షి తరుచూ కనిపిస్తుంది. ఎగువ అస్సాంలో హైతా అని మరియు దిగువ అస్సాంలో హైటోల్ అని పిలుస్తారు.

ఈ పక్షి దట్టమైన అడవులలో, ఎత్తైన చెట్లపై నివసించడానికి ఇష్టపడతాయి.. ఇవి పీపల్, మర్రి వంటి ఎత్తైన చెట్లపై తమ గూళ్ళను నిర్మిస్తాయి.

ఇది సుమారు 26 సంవత్సరాలు జీవిస్తుంది. 32 నుంచి 36 సెంటీమీటర్ల పొడవున్న ఈ పక్షి చెట్ల కొమ్మలపై మాత్రమే కూర్చుంటుంది.

ఈ హరియాల్ పక్షి చాలా అరుదుగా నేలపైకి వస్తుంది. దిగినా కాళ్ల కింద పెట్టకుండా రెక్క తెరిచి కూర్చుంటుంది.