బిడ్డ సమాధి వద్ద.. భోరున ఏడ్చిన ఏనుగు
TV9 Telugu
10 February 2024
ఈ భూమ్మీద తల్లీబిడ్డల ప్రేమ వెలకట్టలేనిది. తల్లీబిడ్డల ప్రేమ, అనుబంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
బిడ్డ తన కంటికి క్షణం పాటు కనిపించకపోతే ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఆచూకీ కోసం అటు ఇటు పరిగెడుతుంది.
కానీ అదే బిడ్డ తన కళ్ల ముందు చనిపోతే ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తుంది. ఓ ఏనుగు కూడా తన బిడ్డ కోసం భోరున విలపించింది.
చనిపోయిన పిల్ల ఏనుగును పూడ్చిపెట్టిన సమాధి వద్ద కన్నీరు కార్చుతూ అలాగే ఉండిపోయింది ఓ తల్లి ఏనుగు.
ఈ హృదయవిదారక ఘటనను ఇండియన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా పని చేస్తున్న సుశాంత నంద తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
అక్కడ ఉన్న ఓ ఏనుగు తన పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది. కానీ కొన్ని గంటల్లోనే ఆ పిల్ల ఏనుగు చనిపోయింది.
పోస్టుమార్టం అనంతరం దాన్ని పూడ్చిపెట్టారు. ఇక ఆ సమాధి వద్దకు చేరుకున్న తల్లి ఏనుగు.. బోరున విలపించింది.
తన కళ్ల నుంచి కన్నీరు కారుతూనే ఉంది. ఏనుగు గుండెలవిసేలా రోదించడంతో అక్కడున్న అటవీశాఖ అధికారుల హృదయాలు బరువెక్కిపోయాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి