16th August 2023
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, పోషకాలు సమృద్ధిగా తీసుకోవడం అవసరం. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు
పాలు.. పోషకాహారానికి మంచి మూలంగా పరిగణిస్తారు. అందుకే చాలామంది పాలను రోజూ తాగుతారు. కొందరు ఉదయం మరికొందరు రాత్రిపూట తాగుతారు
క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్ ఎ, బి6, డి, మెగ్నీషియం, ఫాస్పరస్, అయోడిన్ వంటి పోషకాలు పాలలో సమృద్ధిగా ఉంటాయి.
అయితే, కొన్ని పదార్థాలతో కలిపి పాలను తీసుకోకూడదు.. ఇలా తీసుకుంటే.. అనారోగ్యం బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు అవేంటో తెలుసుకోండి..
పెరుగును పాలతో ఎప్పుడూ తినకూడదు లేదా పాలు తాగిన తర్వాత పెరుగు తినకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి హానికరం, కడుపు సమస్యలు వస్తాయి.
పాలతో పాటు పుల్లని పండ్లను (సిట్రస్ పండ్లు) తీసుకోవడం కూడా మానేయాలి. పాలు - సిట్రస్ పండ్లను కలిపి తీసుకుంటే, అది కడుపు నొప్పి, వాంతులను కలిగిస్తుంది.
చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, మీరు దీన్ని ఎల్లప్పుడూ పాలతో తీసుకోవడం మానుకోవాలి. దీని కారణంగా ఫుడ్ పాయిజనింగ్, చర్మ సమస్యలు వస్తాయి.
పాలతో కలిపి స్పైసీ ఫుడ్, సాల్టెడ్ స్నాక్స్, ప్రొటీన్ రిచ్ థింగ్స్.. తీసుకోవడం కూడా మానేయాలి. ఎందుకంటే ఇది యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇలా ఎప్పుడూ చేయకండి.