గర్భం దాల్చాలంటే దంపతులు ఎప్పుడు శృంగారం చేయాలి.?

Ravi Kiran

16 July 2024

అమ్మానాన్న కావాలన్నది ప్రతీ ఒక్క దంపతుల కల. ఇక ఆ కలను నిజం చేసుకోవాలంటే కొన్ని విషయాల్లో అవగాహన ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. 

అసలు గర్భం దాల్చాలంటే ఎలాంటి సమయంలో శృంగారం చేయాలి.? ఎప్పుడు సరైన సమయం.? ఎలాంటి జీవనశైలిని పాటించాలి.? అనేది ఇప్పుడు తెలుసుకుందామా 

వాస్తవానికి పిల్లలు పుట్టకపోవడానికి కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు కారణమైతే.. మరికొన్నిసార్లు దంపతులకు కొన్ని విషయాలు తెలియనప్పుడే గర్భధారణ అవకాశాలు తక్కువగా ఉంటాయి. 

ఋతుచక్రం రోజుల గురించి సరిగ్గా సమాచారం లేకపోవడం, అండోత్సర్గము రోజులను తప్పుగా అర్థం చేసుకోవడం.. మొదలైనవి సరిదిద్దుకోకపోతే పిల్లల కోసం చాలా ఏళ్లు నిరీక్షించక తప్పదని వైద్యులు అంటున్నారు. 

ఋతుస్రావం అయిన 7 రోజుల తర్వాత జంట శృంగారం చేయాలి. రోజువారీ సంభోగం లేదా ప్రతి రెండు రోజులకు ఒకసారి అనువైనది. అలా చేస్తే గర్భం దాల్చే అవకాశం ఎక్కువట.

అలాగే పీరియడ్స్ వచ్చే వారం ముందు కలయిక గర్భం దాల్చడానికి అంతగా ప్రయోజనం కలగదని వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే పీరియడ్స్ డేట్స్ బట్టి.. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 

అంతేకాదు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే ముందు.. దంపతులిద్దరూ డాక్టర్‌ను కలిసి.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, అలాగే ఆటంకాలు ఏవి లేకుండా చూసుకోవడం మంచిదట. 

ప్రెగ్నెన్సీ కోసం మాంచి జీవనశైలి చాలా ముఖ్యం. మద్యపానం, ధూమపానం లాంటివి చేయకూడదు. మంచి పౌష్టిక ఆహరం క్రమం తప్పకుండా తీసుకోవాలి.