దంతాల చిగుళ్లలో రక్తస్రావం నివారించే మార్గాలు..

10 August 2023

చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది దంతాల పాడైపోవడంతో పాటు చిగుళ్ల వాపు వంటి మరింత తీవ్రమైన నోటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తస్రావం నివారించడంలో సహాయపడే సహజ నివారణ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మంచి టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తే మీ చిగుళ్ళను చికాకు పెడుతూ, రక్తస్రావం కలిగించే హానికరమైన పదార్థాల నిర్మాణాన్ని మీరు నిరోధించగలగుతారు.

నోటి పరిశుభ్రత ముఖ్యం

మీ చిగుళ్లలో మంటను తగ్గించడానికి  ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పును కరిగించి, 30 సెకన్ల పాటు బాగా పుక్కిలించండి.

ఉప్పునీటితో పుక్కలించాలి

ఒక టేబుల్ స్పూన్ నూనెను  మీ నోటిలో ఉంచి పుక్కిలించాలి. ఇది నోటి నుండి హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి చిగుళ్ళలో మంటను తగ్గిస్తుంది.

ఆయిల్ పుల్లింగ్

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

విటమిన్ సి

గ్రీన్ టీ నోటిలో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తాయి. రోజుకు ఒకటి నుండి రెండు కప్పులు తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

గ్రీన్ టీ

పొగాకు ఉత్పత్తులను నివారించడం వల్ల చిగుళ్లలో రక్తస్రావం, ఇతర నోటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. పొగాకు వాడకం మీ చిగుళ్లను చికాకుపెడుతుంది.

పొగాకును దూరం పెట్టాలి