అధిక ప్రోటీన్స్ కోసం శాఖాహారులు వీటిని తినొచ్చు..

8 August 2023

చాలామంది మాంసాహారాల్లోనే అధిక ప్రోటీన్ ఉందని అపోహ పడతారు. ఇది కరెక్ట్ కాదు.. శాకాహారులు తినే పదార్ధాలలోనూ అధిక ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

 ప్రజలందరూ తమ ఆహార వనరులలో చేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఆహారం. ఇందులో ఎక్కువగా ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 

పన్నీర్

మూంగ్ దాల్ ఖిచ్డీ: ఈ ఖిచ్డీలో మీ శరీరానికి కావలసినన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అవి కడుపు సంబంధిత వ్యాధులను దరికి చేరకుండా మిమ్మల్ని రక్షిస్తాయి. అలాగే ఇందులో ఉండే అధిక ప్రోటీన్లు బరువు తగ్గడంలో సహాయపడతాయి.   

మొలకలు: మొలకలలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు బరువు తగ్గడంలో దోహదపడతాయి. మీ డైట్‌లో మొలకలు జోడిస్తే మీ ఆరోగ్యానికి శ్రీరామరక్షే. మొలకలను మీరు సలాడ్లు, సూప్‌లు, పాస్తా, మాంసపు వంటకాల్లో జోడించవచ్చు. 

టోఫు మసాలా చాలామందికి టోఫు అనేది ఏంటో పెద్ద తెలియదు. ఇది సోయాబీన్స్ నుంచి తయారైన ఒక పన్నీర్ లాంటి పదార్ధం. ఈ టోఫుతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. అలాగే ఇందులోని అధిక ప్రోటీన్లు బరువు తగ్గడంలో సహపడతాయి. 

రాజ్మా, రైస్ రాజ్మా రైస్, రాజ్మా చావల్.. ఇది అందరూ ఇష్టపడి తినే టేస్టీ ఫుడ్. ఇందులో పుష్కలంగా పోషకాలు, ప్రోటీన్లు, ఐరన్, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. రాజ్మాలో ఉండే ఫైబర్, పొటాషియం, జింక్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి.   సాయపడుతుంది.

క్వినోవా బరువు తగ్గాలని చూస్తున్నవారికి క్వినోవా చక్కటి ఆప్షన్. ఇందులో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు, ప్రోటీన్లు ఫైబర్.. ఇవన్నీ కలిసి మీరు త్వరగా బరువు తగ్గడంలో సహాయపడతాయి.

సత్తు పరాటా ఈ ఆహారాన్ని బీహార్ లేదా ఒడిశా వాసులు ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల.. బరువు తగ్గేవారికి బెస్ట్ ఆప్షన్.