పసుపు, వేప కలిపి వాడితే ఎన్నో ఉపయోగాలు..
14 August 2023
పసుపు, వేప ఆకులని కలిపి వాడితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండు ఆయుర్వేద గుణాలతో నిండి ఉంటాయి.
వేప రసంలో పసుపు కలిపి తాగితే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. వేప, పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
వాటి నుంచి అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రెండింటినీ కలిపి వాడితే ఎన్నో రకాల సమస్యలను అధిగమించవచ్చు.
వేప, పసుపు కలిపి తీసుకుంటే శరీరాన్ని వైరల్ ఫ్లూ బారి నుంచి కాపాడవచ్చు. వేప, పసుపు కలిపి వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
మీరు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వేప, పసుపును ఉపయోగించవచ్చు. ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తగ్గించడంలో ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి.
వేప ఆకుల పేస్ట్ తయారు చేసి పసుపు కలిపి చిన్న చిన్న గాయాలపై రోజుకు రెండు లేదా మూడుసార్లు రుద్దితే గాయం పెద్దది అవకుండా సెప్టిక్ అవకుండా నయం అవుతుంది.
వేప ఆకులు వేసిన నీటిని ఆకు పచ్చగా మారే వరకు ఉడకబెట్టండి. ఆకు పచ్చగా మారిన నీరు చల్లబడే వరకు ఉండి ఆ తర్వాత మీ జుట్టును షాంపూతో కడగండి.
షాంపుతో కడిగిన జుట్టును మళ్లీ చల్లబరిచిన వేపాకు నీటితో కడిగితే అప్పుడు జుట్టులో ఉండే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి