సోయాబీన్స్ తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
TV9 Telugu
సోయాబీన్స్ అనేవి అనేక పోషకాల గని. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం.
సోయాబీన్స్ లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది.. కొలెస్ట్రాల్ అసలు ఉండవు. డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
సోయాబీన్స్ లో కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని డైట్‌లో చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగుపరచి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి సమ్మేళనాలు సోయాబీన్స్‌లో ఉంటాయి. ఇవి హృదయనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.
శరీరం తన భాద్యతలు నిర్వహించడంలో పోషకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సోయాబీన్స్‌లో ఫోలేట్, విటమిన్ కే, విటమిన్ బి వంటి పోషకాలు తగిన మోతాదులో ఉంటాయి.
ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ ఖనిజాలు ఉండటం వల్ల దీన్ని డైట్‌లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
సోయాబీన్స్‌లో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా, బలంగా ఉండేలా చేస్తాయి. కీళ్ల నొప్పులను కూడా నొప్పులు కూడా తగ్గిస్తాయి.
సోయాబీన్స్‌లో ఆల్కలాయిడ్స్ తగిన మోతాదులో ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
మహిళల్లో మెనోపాజ్ సమస్యతో బాధపడేవారు సోయాబీన్స్ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. చక్కెర వ్యాధితో బాధపడేవారు గ్లూకోజ్ లెవల్స్ నియంత్రణలో ఉంచుతాయి