వేసవి కాలం వచ్చింది అంటే చాలామంది సబ్జా గింజల్ని స్మూతీస్, జ్యూస్, సలాడ్స్ వంటి వాటిలో యాడ్ చేసుకుని తింటూ ఉంటారు. అయితే వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరాన్ని చల్లగా ఉంచుతుంది: సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి వేసవి వేడి నుండి కాపాడి శరీరాన్ని చల్ల బరుస్తుంది.
నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు జెల్ లాంటి పొరను ఏర్పరుస్తాయి, ఇది శరీరంలో నీటిని ఎక్కువసేపు నిలుపుతుంది, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.
సబ్జా గింజలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
తక్కువ కేలరీలు మరియు అధిక ఫైబర్ కలిగిన సబ్జా గింజలు ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
సబ్జా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి బలోపేతం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి.
సబ్జా గింజలలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్ చేసి, మొటిమలు మరియు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.
సబ్జా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే ఇంఫ్లమేషన్ సమస్య ఉండదు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
సబ్జా గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. జ్ఞాపకశక్తికి మేలు చేస్తాయి