రోజు ఇలా చేస్తే జీర్ణ సమస్యలు మాయం..
13 August 2023
టైంకి భోజనం చేస్తే అసలే సమస్య ఉండదు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సమయానికి తినేలా పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి.
దీనితోపాటు అధికంగా నీరు త్రాగటం అలవాటు చేసుకోవాలి. జీర్ణక్రియ సక్రమంగా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ఆవసరం.
పొగ తాగడం, పరిమితికి మించి కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. మద్యం, సిగరెట్లు , కాఫీ లాంటి పానియాలు జీర్ణవ్యవస్థ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి.
అలాగే టైం లేదనో, ఆహారం రుచిగా లేదనో హడావిడిగా కానీయకుండా ఆహారం పూర్తిగా నమిలి తినాలి. ఒత్తిడి శరీర ఆరోగ్యం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
సమయం కుదిరినప్పుడల్లా మీరు ఏ విషయాలవల్లనైతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో.. వాటిని ఏ విధంగా అధిగమించవచ్చో ఆలోచించాలి.
ఫైబర్ శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మీ సొంతం అవుతుంది.
పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా ఫైబర్ కీలకంగా వ్యవహరిస్తుంది.
అందుకే రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధమైన అలవాట్లను పాటిస్తే క్రమంగా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి