ఈ చిట్కాలతో మొటిమల సమస్య పరార్..

09 August 2023

ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మొటిమలు. హార్మోన్ల మార్పులు, ఇత‌ర కార‌ణాల వల్ల  వస్తున్నాయి.

దీనికి కాలుష్యం, నిద్రలేమి, జీవనశైలి కూడా కారణం కావచ్చు. చాలా మంది బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లడం, క్రీమ్స్ వాడడం వంటివి చేస్తుంటారు.

అయితే ఇంట్లో దొరికే కొన్ని  ప‌దార్థాల‌తోనే ఈ  మొటిమ‌ల‌కు చెక్ పెట్టవచ్చు. దీని వల్ల చాలా త్వ‌ర‌గా, సుల‌భంగా తగ్గుతాయి.

రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని బాగా క‌డిగి మొటిమల‌పై టూత్‌పేస్ట్‌ రాసి ఉందయాన్నే కడిగేస్తే మొటిమ‌లు తగ్గుముఖం పడతాయి.

నీటిని బాగా మ‌రిగించి వచ్చిన ఆవిరిని ముఖానికి పట్టించి గోరు వెచ్చ‌ని నీటితో క‌డ‌గాలి. ప్రతిరోజు ఇలా చేస్తే మొటిమ‌లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

మొటిమ‌ల‌పై గుడ్ల‌లో తెల్ల‌సొన అప్లై చేసి కొంత సేపు తర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క‌డ‌గాలి. రోజుకు 3 సార్లు ఇలా చేస్తే మొటిమ‌లు పోతాయి.

ఒక శుభ్ర‌మైన వ‌స్త్రంలో ఐస్ క్యూబ్స్ ను చుట్టి దాన్ని మొటిమ‌ల‌పై అప్లై చేస్తే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

రాత్రి నిద్రించే ముందు శుభ్రంగా ముఖాన్ని క‌డిగి మొటిమ‌ల‌పై టాల్కం పౌడ‌ర్‌ను అప్లై చేసి ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌డ‌గాలి.