ఈ చిట్కాలతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం..

2 August 2023

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి ఎక్కువగా నడివయసులో ఉన్నవారిలో  కనిపిస్తుంది.

ఎక్కువగా మహిళల్లో ఈ వ్యాధి కనిపించడం మనం చూస్తుంటాం.

కేవలం కీళ్లనొప్పులు మాత్రమే కాక  శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, నిద్ర లేకపోవడం కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి.

అయితే చిట్కాలు పాటిస్తే త్వరగా ఈ వ్యాధి నుంచి కోలుకుంటారు.

ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడేవారు రెగ్యులర్ గా వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

అంతేకాదు ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఫిజియోథెరపిస్టు సలహా మేరకు ఎక్సర్సైజ్ చేస్తే సత్ఫలితాలను ఇస్తుంది.

ముఖ్యంగా వాకింగ్ చేయడం, మోకాళ్లతో ఎక్సర్సైజ్ చేయడం వంటివి చేయాలి.

చిన్న చిన్న బరువులు లేపడం వంటివి చేయడం ద్వారా కండరాలు పటిష్టం అవుతాయి.