ఈ చిట్కాలతో తలనొప్పి నుంచి ఉపశమనం..

శరీరంలో నీరు లేకపోవడం వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి.

మీ ఆహారంలో నీరు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం మంచిది.

యోగా చేయడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ సమస్య నుంచి కూడా సులభంగా బయటపడొచ్చు.

మీకు తలనొప్పి సమస్య ఉంటే యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.

అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది.

తలనొప్పి విషయంలో అల్లం టీ కూడా ఉపశమనం కలిగిస్తుంది.

రోజుకు 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవడం ద్వారా కూడా తలనొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు.